'ఇది ప్రాణాలతో చెలగాటమే..': వైద్య పరికరాల దోపిడీపై మహారాష్ట్ర సర్కార్ ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మహారాష్ట్ర

వైద్య పరికరాల విక్రయాల్లో ఎమ్మార్పీ పేరిట జరుగుతున్న భారీ దోపిడీపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ 2800 శాతానికి పైగా లాభాలు ఆర్జించడం క్షమించరాని నేరమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే మండిపడ్డారు. ఈ వ్యవహారంపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలోనూ, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎఫ్‌డీఏ సర్వేలో ఐవీ సెట్లు, సిరంజీలు, నెబ్యులైజర్ మాస్కులపై విపరీతమైన మార్జిన్లు ఉన్నట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.