ఈపీఎఫ్ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవం: కీలక సేవలను ప్రారంభించనున్న కేంద్రమంత్రి

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

ఈపీఎఫ్ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించనున్నారు అని Ministry of Labour & Employment, GoI వెల్లడించారు. ఈ వేదికగా రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న నిష్క్రియ ఖాతాల ఆటో సెటిల్మెంట్ తో పాటు వాట్సాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు మరింత సులభంగా సేవలు అందించే లక్ష్యంతో ఈ కొత్త సంస్కరణలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.