ఆటోమొబైల్ సంస్థల పెట్టుబడులు: ఏపీలో రూ.1,614 కోట్లతో యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందం

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

దక్షిణ కొరియాకు చెందిన మూడు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రాజెక్ట్ల విస్తరణకు ముందుకు వచ్చాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ద్వారా రూ.1,614 కోట్ల భారీ పెట్టుబడులు రానుండగా, సుమారు 1,419 మందికి నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడును కాదని కొరియా సంస్థలు ఏపీని ఎంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కృషికి నిదర్శనంగా నిలిచింది.