ధర్మవరంలో వినాయక లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు

రిపోర్టర్: రమేష్ స్థలం: ధర్మవరం

శ్రీసత్యసై జిల్లా ధర్మవరం పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది. పార్థసారథి నగర్ సమీపంలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదాన్ని ముస్లిం దంపతులు చాందిని, మస్తాన్ వలి శనివారం జరిగిన వేలంపాటలో రూ.1,45,000లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులను వినాయక కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.