ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న నటిస్తోంది
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: చెన్నై
భారతీయ సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎం.ఎస్. – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ చిత్రంలో రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బయోపిక్‌ను సెప్టెంబర్ 16న చెన్నైలో ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, అల్లు అరవింద్, బన్నీ వాసు, రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.