కలకలం రేపిన హత్య: కలలో స్నేహితుడు కనిపించడంతో పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
రిపోర్టర్: అశోక్
స్థలం: Kalyan
మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతంలో జరిగిన హత్య కేసులో నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ మరాఠే వెల్లడించారు. మృతుడు విశాల్ కదమ్ తో మద్యం సేవించే సమయంలో వివాదం తలెత్తడంతో ప్రభు కార్కడే అనే వ్యక్తి దాడి చేసి హత్య చేశాడని తెలిపారు. మృతదేహాన్ని మరుగుపరచడానికి సహకరించిన ఇల్లు యజమాని సందేష్ మ్హత్రేను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.