దివ్యాంగులకు రూ.కోటి పది లక్షల విలువైన సహాయ ఉపకరణాలు అందజేత
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పశ్చిమ గోదావరి
పాలకొల్లు నియోజకవర్గంలో భగవంతుని స్వరూపులైన దివ్యాంగులకు సెయిల్ సీఎస్ఆర్ నిధులు రూ.కోటి పది లక్షలతో సహాయ ఉపకరణాలను ఉచితంగా అందజేసినట్లు జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ మెగా శిబిరంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మతో కలిసి పాల్గొని దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.