విదేశీ మహిళ పట్ల అసభ్య ప్రవర్తన ఘటనలో నలుగురి అరెస్ట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Ajmer

రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లా కిషన్గఢ్ డంపింగ్ యార్డ్లో విదేశీ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 2022లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో అజ్మీర్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి నిందితులు మహమ్మద్ ఫుర్ఖాన్, ఫర్ఖాన్, మహమ్మద్ అనీస్, అక్తర్ అలీలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.