ఆంధ్రప్రదేశ్ లో ముమ్మరంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన నలభై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల నోటీసులకు గాను నలభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది విచారణ పూర్తయినట్లు తెలిపారు. మూడు కోట్ల లక్షల మంది ఓటర్ల ఫోటోల పరిశీలన పూర్తయిందని, తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల్లో ఫారం ఆరు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.