మున్సిపల్ ఎన్నికల వేళ కడపలో అరాచకాలు: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఆవేదన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కడప

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ కడప, పులివెందులలో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్లను బెదిరిస్తూ దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి సర్కార్ అక్రమాలపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ప్రతి పోలింగ్ బూత్లో సీసీ ఫుటేజ్ భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. జగన్ ఆదివారం పులివెందుల వస్తారని తెలిపారు.