ట్రైన్ ఫస్ట్ ఏసీలో భారీ చోరీ: కన్నీటిపర్యంతమైన మహిళ ఆవేదన
రిపోర్టర్: విజయ్
స్థలం: లక్నో
లక్నో రైల్వే స్టేషన్ లో ఆనంద్ విహార్ - న్యూ జల్పాయిగురి ఎక్స్ ప్రెస్ లోని ఫస్ట్ ఏసీ బోగీలో జరిగిన చోరీలో రూ. రెండున్నర లక్షల విలువైన ఆభరణాలు, ఇరవై ఐదు వేల నగదు చోరీకి గురయ్యాయని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తన లాక్ చేసిన కంపార్ట్ మెంట్ లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, నాలుగుసార్లు చైన్ లాగినా రైల్వే భద్రతా సిబ్బంది స్పందించలేదని ఆ బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు.