దేశంలో భారీగా పడిపోయిన బంగారం దిగుమతులు!
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: భారతదేశం
కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన దిగుమతి సుంకాల కారణంగా దేశంలో బంగారం దిగుమతులు 30 శాతం వరకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయంగా ధరలు పెరగడం, వినియోగదారుల డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. అయితే రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో మళ్లీ డిమాండ్ పుంజుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.