మైసా సినిమా కోసం చాలా కష్టపడ్డానన్న నటి రష్మిక

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో జరిగిన మైసా సినిమా టీజర్ లాంచ్‌ కార్యక్రమంలో అగ్ర కథానాయిక రష్మిక మందన్న పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో తాను తొలిసారిగా యాక్షన్ జానర్‌లో నటించానని, వాటర్ ఫాల్స్ జంప్‌లు, అండర్‌వాటర్ యాక్షన్ సీన్స్ చేస్తూ ఎంతో కష్టపడ్డానని తెలిపారు. గోండు ట్రైబ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 27న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.