స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టతనిచ్చిన ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
పరిపాలనాపరమైన ఇబ్బందులు రాకుండా రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఒకేసారి షెడ్యూల్ జారీ చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి దరఖాస్తు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ధ్రువపత్రాలు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత అరవై రోజుల పాటు బ్యాలెట్ పత్రాలను భద్రపరుస్తామని ఆయన తెలిపారు.