కరెంట్ వినియోగదారులకు భారీ షాక్: ట్రూఆప్ ఛార్జీల వసూళ్లకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులపై ట్రూ-అప్ ఛార్జీల రూపంలో అదనపు భారం పడనుందని టీజీఈఆర్సీ అధికారులు వెల్లడించారు. రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ ఛార్జీల వసూళ్లకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుండగా, మిగిలిన రూ.5,420.23 కోట్లను గృహ, వాణిజ్య వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. నవంబర్ నుంచి ప్రతి యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత నెల నుంచి 50 పైసల చొప్పున అదనపు వసూళ్లు జరగనున్నాయి.