విజయనగరంలో హెచ్ఐవీ, టీబీపై అవగాహన.. మొబైల్ వాన్ ద్వారా పరీక్షలు
రిపోర్టర్: తాడి
స్థలం: విజయనగరం
విజయనగరం కోట జంక్షన్ వద్ద సమగ్ర సలహా మరియు పరీక్ష కేంద్రం ఆధ్వర్యంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ మరియు టీబీ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొబైల్ వాన్ ద్వారా ప్రజలకు ఉచితంగా రక్త పరీక్షలు చేపట్టారు.
ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరింత సమాచారం కోసం 1097 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోటరావు, గౌరీ, అప్పలనాయుడు, స్వాతి పాల్గొన్నారు.