విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలిరావాలని ఎన్టీఆర్ పోలీస్ పిలుపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఎన్టీఆర్

ఎన్టీఆర్ పోలీస్ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ అధికారులు హృదయపూర్వక స్వాగతం పలికారు. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.