డ్రోన్లు అనుకుని పక్షులపైకి యుద్ధ విమానాలు పంపిన నాటో!

రిపోర్టర్: సురేష్ స్థలం: World

డ్రోన్లు దూసుకొస్తున్నాయని భ్రమించి నాటో యుద్ధ విమానాలు హడావుడిగా గాల్లోకి ఎగిరాయి. లిథువేనియా గగనతలంలో రాడార్ గుర్తించిన అనుమానాస్పద కదలికలను డ్రోన్లుగా భావించి ఇటలీ ఎయిర్‌ఫోర్స్ స్పందించింది. దగ్గరకు వెళ్లిన తర్వాత అవి డ్రోన్లు కాదని పక్షుల గుంపు అని తేలడంతో పైలట్లు అవాక్కయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపధ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఈ వింత ఘటన అంతటా చర్చనీయాంశమైంది.