హింసకు వీడ్కోలు: మాజీ నక్సలైట్లకు ఉపాధి శిక్షణనిచ్చిన ఝార్ఖండ్ జైళ్ల శాఖ
రిపోర్టర్: శివ
స్థలం: హజారీబాగ్
ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ ఓపెన్ జైలులో లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు ప్రభుత్వం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ పూర్తి చేసింది. జైళ్ల శాఖ ఐజీ సుదర్శన్ మండల్ వెల్లడించిన వివరాల ప్రకారం, తుపాకులు పట్టిన అరవై మంది మాజీ నక్సలైట్లు కోళ్ల పెంపకం, టైలరింగ్ రంగాల్లో నైపుణ్యం సాధించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. జనజీవన స్రవంతిలో కలిసి స్వయం ఉపాధితో ముందుకు సాగేలా వీరికి ఈ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.