ఆదిత్య థాక్రేకు దిశా శాలియన్ తండ్రి లీగల్ నోటీసులు

రిపోర్టర్: అశోక్ స్థలం: ముంబై

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసుకు సంబంధించి శివసేన యుబిటి నేత ఆదిత్య థాక్రేకు ఆమె తండ్రి సతీష్ శాలియన్ రూ. 500 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ముంబైలో లీగల్ నోటీసులు పంపారు. తమ కుమార్తె మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు.