పోలవరం పర్యాటక హబ్‌గా అభివృద్ధి: ప్రాజెక్టును ముఖ్మ జాతీయ రహదారులతో అనుసంధానం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Eluru
గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 2027 జూన్ నెలాఖరులో గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం ప్రాజెక్టును మూడు జాతీయ రహదారులతో అనుసంధానించడంతో పాటు స్పిల్‌వేకు సమాంతరంగా ఐకానిక్ వంతెన నిర్మించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.