సికింద్రాబాద్ కాజీపేట రైల్వే లైన్లకు రూ.2419 కోట్ల మంజూరు

రిపోర్టర్: అశోక్ స్థలం: Telangana

తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ ఘట్‌కేసర్ నుంచి కాజీపేట వరకు 110 కిలోమీటర్ల మేకు మూడు మరియు నాల్గవ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,419 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తికావడం ద్వారా ప్రయాణికుల రద్దడి తగ్గడంతో పాటు ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.