పుణెలో దారుణం: రెడ్ సిగ్నల్ వద్ద ఆపినందుకు స్కూటర్ రైడర్పై దాడి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: పుణె
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రెడ్ సిగ్నల్ వద్ద ఆగిన స్కూటర్ రైడర్పై కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయని పలువురు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. పుణెలోని జహంగీర్ ఆసుపత్రి కూడలి వద్ద జరిగిన ఈ షాకింగ్ రోడ్డు రేజ్ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.