రాష్ట్రంలో పూరిగుడిసెలు లేని సమాజమే లక్ష్యమన్న మంత్రి పొంగులేటి
రిపోర్టర్: గోపి
స్థలం: ఖమ్మం
రాష్ట్రంలో పూరిగుడిసె ఉండకూడదనే ముఖ్యమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పొంగులేటి శ్రీనివాస రెడ్డి - మంత్రి, పాలేరు ఎమ్మెల్యే వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సహచర కేబినెట్ మంత్రులందరం కలిసి ప్రతి పేదవాడి గుడిసెను పక్కా ఇల్లుగా మార్చాలని గట్టిగా సంకల్పించామని తెలిపారు. ఇందులో భాగంగానే రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పూరిగుడిసెల్లో నివసించేవారికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. జనగామ నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు ఐదు వందల గుడిసెల్లో ఉంటున్న నిరుపేద కుటుంబాలకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆయన స్పష్టం చేశారు.