నిరుద్యోగులను మోసం చేసేందుకే జాబ్ మేళా నిర్వహిస్తున్నారు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కోదాడ
కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు నిరుద్యోగులను మోసం చేసేందుకే బలవంతపు వసూళ్లతో జాబ్ మేళా నిర్వహిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి, సిమెంట్ ఫ్యాక్టరీల నుండి నిధులు వసూలు చేసి సొంత ప్రచారానికి వాడుకుంటున్నారని, సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నా పట్టించుకోవట్లేదని ఆరోపించారు.