లక్నోలో ఆపిల్ మేనేజర్ వివేక్ తివారీ హత్య కేసులో పోలీసు దోషిగా నిర్ధారణ

రిపోర్టర్: మహేష్ స్థలం: Lucknow

లక్నోలో ఎనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆపిల్ ఏరియా సేల్స్ మేనేజర్ వివేక్ తివారీ హత్య కేసులో లక్నో కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడైన కానిస్టేబుల్ ప్రశాంత్ చౌదరిని హత్యానేరం కింద కాకుండా నేరపూరిత నరహత్య కింద దోషిగా తేల్చగా, సహ నిందితుడైన కానిస్టేబుల్ సందీప్ కుమార్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 21న శిక్షను ఖరారు చేయనున్నారు. 2018 సెప్టెంబర్ 29న గోమ్తి నగర్ ఎక్స్‌టెన్షన్‌లో కారు ఆపలేదన్న కోపంతో కానిస్టేబుల్ ప్రశాంత్ చౌదరి జరిపిన కాల్పుల్లో వివేక్ తివారీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.