విద్యార్థులకు గుడ్ న్యూస్: ఐపీయూలో అదనపు పరీక్షలకు గోల్డెన్ ఛాన్స్

రిపోర్టర్: విజయ్ స్థలం: న్యూఢిల్లీ

నిర్ణీత కాలంలో డిగ్రీ పూర్తి చేయని విద్యార్థులకు గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం మరో అవకాశం కల్పించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. గరిష్ట పరీక్షా అవకాశాలు కోల్పోయిన యూజీ, పీజీ విద్యార్థులు ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. నవంబర్ ఆరు లోపు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంటూ డిసెంబర్, జనవరి నెలల్ లో ఆయా సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.