ఫాస్టాగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం

రిపోర్టర్: గోపి స్థలం: భారతదేశం

జాతీయ రహదారులపై టోల్ వసూలును సులభతరం చేసేందుకు కేంద్రం 'వన్‌ట్యాగ్' విధానాన్ని తీసుకొచ్చింది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ మాదిరిగానే వాహనంపై ఉన్న పాత స్టిక్కర్ మార్చకుండానే ఇష్టమైన బ్యాంకుకు ఫాస్టాగ్ అకౌంట్‌ను మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించారు. 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్ ద్వారా ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.