లాలూ ప్రసాద్ యాదవ్ తో సోనియా గాంధీ భేటీ: యూపీఏ నాటి పాలనపై చర్చ
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ సోమవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారని తేజస్వి యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని లాలూ కుమార్తె, ఎంపీ మీసా భారతి నివాసంలో ఈ సమావేశం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం లాలూ ఢిల్లీకి రాగా, సోనియా గాంధీ స్వయంగా ఆయన నివాసానికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యూపీఏ హయాం నాటి సంక్షేమ పథకాలను ఇరు నేతలు నెమరువేసుకున్నారు.