కడప, పులివెందులలో మున్సిపల్ పోలింగ్ ఉద్రిక్తత: వైసీపీ, టీడీపీ ఏజెంట్ల ఘర్షణ
రిపోర్టర్: సతీష్
స్థలం: కడప
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో కడప, పులివెందుల నియోజకవర్గాల్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి తమను వెళ్లనివ్వకుండా టీడీపీ ఏజెంట్లు అడ్డుకుంటున్నారని, తమపై దాడులు చేసి ఫోన్లు పగలగొట్టారని వైసీపీ ఏజెంట్లు తీవ్ర ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపుచేసి పరిస్థితిని శాంతింపజేశారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఓటర్లు భారీ సంఖ్యలో క్యూలైన్లలో బారులు తీరారని అధికారులు స్పష్టం చేశారు.