'తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు సింగపూర్ ఆసక్తి': సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమను నెలకొల్పే దిశగా సింగపూర్ ప్రతినిధుల బృందం ముందుకు వచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ భవనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సింగపూర్ ప్రతినిధులు ప్రత్యేకంగా కలిశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, హైటెక్ రంగంతో పాటు మూసీ నది పునరుజ్జీవనం, మోడ్రన్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, నైట్ ఎకానమీ మరియు నెట్‌జీరో లక్ష్యాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చలు జరిగాయి.