ట్రంప్ జెలెన్ స్కీ మధ్య ఫోన్ సంభాషణ యుద్ధ ముగింపుపై చర్చ

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూయార్క్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దౌత్య ప్రయత్నాలలో భాగంగా ఇద్దరూ న్యూయార్క్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా జరిగే ఈ భేటీ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో అత్యంత కీలకం కానుందని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.