గాజువాకలో పర్యటించిన ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
గాజువాకలో ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ పర్యటించారు. జనసేన పార్టీ కార్యకలాపాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించి, స్థానిక నాయకులతో సమావేశమై పార్టీ పనితీరును, క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొని తమ నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించారు.