స్థానిక ఎన్నికల్ లో సంచలనాలు: స్వతంత్ర అభ్యర్థిగా సత్తా చాటిన విద్యార్థి

రిపోర్టర్: మహేష్ స్థలం: అమలాపురం

స్థానిక సంస్థల ఎన్నికల్ లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో డిగ్రీ విద్యార్థి రవణం సత్యశరత్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి రెండో స్థానం సాధించారు. అలాగే పలాసలో ఓట్లు సమం కావడంతో లాటరీ ద్వారా విజేతను ప్రకటించారు. విశాఖలో చెల్లి మేయర్ గా, అక్క కార్పొరేటర్ గా ఘన విజయం సాధించగా, పలువురు నేతలు వరుస విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేశారు.