గ్రామీణ క్రీడాకారులకు నిరాశ మిగులుస్తూ అసంపూర్తిగా ఇండోర్ స్టేడియం నిర్మాణాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
గత తెదేపా ప్రభుత్వం హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆర్భాటంగా ప్రారంభించిన ఇండోర్ స్టేడియం నిర్మాణాలు వివిధ కారణాలతో చాలాచోట్ల అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయని న్యూస్టుడే కథనం వెల్లడించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీటి నిర్వహణను పూర్తిగా విస్మరించడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు, క్రీడాకారులు తీవ్రంగా నష్టపోతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో నిధులు మంజూరు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం కావాల్సి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.