ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: బీజేపీకి తొత్తుగా మారారని ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

ఓట్ల చోరీ ద్వారానే కేంద్రంలో అధికారంలోకి వచ్చారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంపై దాడి చేస్తూ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, భవిష్యత్ లో ఆయన జైలుకు వెళ్లక తప్పదని రాహుల్ గాంధీ హెచ్చరించారు.