నాగావళి వరద ప్రవాహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నది వరద ప్రవాహ పరిస్థితిని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ వివరాలను వెల్లడించింది. నది నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామని, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.