గాజువాకలో కృష్ణాష్టమి వేడుకలు.. రంగవల్లుల పోటీలతో సందడి

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

గాజువాక పరిధిలోని చిన్న నడుపూరు వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్వహించిన రంగవల్లిక పోటీలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, జనసేన 73వ వార్డు అధ్యక్షులు రౌతు గోవిందరావు పాల్గొన్నారు. విజేతలతో పాటు పాల్గొన్న వారందరికీ అతిథులు బహుమతులు ప్రదానం చేసి ప్రోత్సహించారు.