గురుకులాల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్: డివైజ్ల ఏర్పాటుకు కార్యదర్శి కీలక ఆదేశాలు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులకు ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. ఎల్లుండిలోగా సంబంధిత డివైజ్లను ఏర్పాటు చేయాలని కార్యదర్శి రవి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు లైబ్రరీలు, ల్యాబ్లు అందుబాటులో ఉంచాలని, నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా గురుకులాల్లో చదువుతున్న ఆరు లక్షల మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తించనుంది. విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టారు.