బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అక్రమ అరెస్ట్
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఇంటి తాళాలు పగలగొట్టి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు ఇలాంటి అణచివేత ధోరణికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.