తాటిపూడి రిజర్వాయర్ నీటిమట్టాన్ని పరిశీలించి అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం తాటిపూడి రిజర్వాయర్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిజర్వాయర్కు వస్తున్న ఇన్ఫ్లో, నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 3.32 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.49 టీఎంసీలుగా ఉందని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.