అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపునకు నేడే చివరి గడువు!

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు సెప్టెంబర్ 15 చివరి తేదీ. వార్షిక పన్ను బాధ్యత రూ. 10 వేలు దాటిన వారు ఈ ముందస్తు పన్ను కట్టాలి. గడువులోగా చెల్లించకపోతే సెక్షన్ 234C కింద వడ్డీ భారం పడే అవకాశం ఉంది. పన్ను నిపుణులు వెంటనే బకాయిలు చెల్లించాలని సూచిస్తున్నారు.