దేశ సేవకే అంకితమైన ప్రధాని మోడీ ఆయురారోగ్యాలు కోరుతూ ప్రత్యేక పూజలు
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని లంకెలపాలెం జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో పరవాడ మండల బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు. దేశం కోసం రెండున్నర దశాబ్దాలుగా సేవనందిస్తున్న మోడీ దీర్ఘాయుషుతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు పిల్లా సతీష్, ప్రధాన కార్యదర్శి బంతి కోరు గోవిందరాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా పాల్గొని ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.