వైభవ్ సూర్యవంశీకి అరుదైన రికార్డు: బిహార్ జట్టు కెప్టెన్గా ఎంపిక

రిపోర్టర్: విజయ్ స్థలం: పాట్నా

టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన పదిహేనేళ్ల వయసులోనే అరుదైన మైలురాయిని అందుకున్నాడని బిహార్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు స్పష్టం చేశాయి. రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో తొలి రెండు మ్యాచ్ ల కోసం బిహార్ సీనియర్ జట్టుకు అతడిని కెప్టెన్ గా నియమించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ టోర్నీ చరిత్రలో జట్టుకు నాయకత్వం వహించనున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ అపూర్వ ఘనత సాధించనున్నాడని, ఈ బాధ్యత అతడిని మరింత ఉన్నత స్థాయికి చేర్చుతుందని నిర్వాహకులు తెలిపారు.