అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు: ఫిబ్రవరి 3న ప్రారంభించనున్న ప్రధాని
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దక్షిణాసియాలోనే తొలిసారిగా ఐబీఎం ఆధ్వర్యంలో అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు కానుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 10 నుంచి ఇన్స్టలేషన్ ప్రక్రియ ప్రారంభమై జనవరి 15 నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రం ఫిబ్రవరి 3న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుందని అమరావతి వర్గాలు స్పష్టం చేశాయి.