యూకే ఉద్యోగాల పేరుతో యూట్యూబర్ నందన దంపతుల భారీ మోసం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
యూకేలో మంచి ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రముఖ యూట్యూబర్ రామ నందన మరియు ఆమె భర్త మధుకర్ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 25 లక్షల నుంచి రూ. 95 లక్షల వరకు వసూలు చేసి నకిలీ డాక్యుమెంట్లు ఇవ్వడంతో బాధితులు సోమవారం హైదరాబాద్లోని బేగంపేట ప్రజాభవన్లో అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు డీజీపీ, ఈడీ దర్యాప్తునకు సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు.