అమెరికా రాజకీయాల్ లో తీవ్ర కలకలం: ట్రంప్ కేబినెట్ లో మార్పుల వేడి

రిపోర్టర్: రాజేష్ స్థలం: Washington

అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొన్న ఘోర పరాజయంపై వైట్ హౌస్ లో తీవ్ర స్థాయిలో అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ ఎన్నికల వైఫల్యానికి విదేశాంగ విధానం, ఇరాన్ యుద్ధ నిర్వహణే కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పదవులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని డైలీ మెయిల్ కథనం స్పష్టం చేసింది.