నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ ప్రభుత్వం
రిపోర్టర్: గోపి
స్థలం: ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ నేడు 20 శాఖలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.