సైబర్ మోసం: ఓటీపీ చెప్పకున్నా వాట్సాప్ రిప్లైతో బ్యాంక్ ఖాతా ఖాళీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
ఓటీపీ చెప్పకపోయినా లేదా లింకులు ఓపెన్ చేయకపోయినా కేవలం వాట్సాప్ సందేశాలకు సమాధానం ఇస్తేనే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నకిలీ బ్యాంకు మెసేజ్‌లు, ఆటో ఎగ్జిక్యూషన్ ఫైళ్లతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని, అనుమానం వస్తే వెంటనే అధికారిక యాప్‌లు లేదా 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.