పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై రైతు మృతి

రిపోర్టర్: రమేష్ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం చెన్నరాయుడుపల్లిలో మంగళవారం మధ్యాహ్నం పొలంలో పనిచేస్తుండగా సంభవించిన పిడుగుపాటు ఘటనలో పోరెడ్డి చెన్నకేశవులు (30) అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి అంజయ్యతో కలిసి పొలంలో ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇదే ఘటనలో దేశినేని కేశవులు (35) స్వల్పంగా గాయపడగా, స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.